కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 358కి పెరిగింది. ఇక శనివారం రెస్క్యూ కార్యకలాపాలను ఆర్మీ, NDRF బృందాలు ముమ్మరం చేశాయి. శిథిలాల కింద కూలిపోయిన ఇళ్లలో ఉన్న ప్రజలను గుర్తించేందుకు రాడార్ ఉపయోగిస్తున్నారు. నార్తర్న్ కమాండ్ నుండి ఒక జావర్ రాడార్, ఢిల్లీలోని తిరంగా మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుండి నాలుగు రీకో రాడార్‌లను వినియోగిస్తున్నారు.