దేశాల మధ్య Deep Fake చిచ్చు

55చూసినవారు
దేశాల మధ్య Deep Fake చిచ్చు
ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ కలకలం సృష్టిస్తోంది. చైనాపై దాడి చేయాలంటూ స్వయంగా దేశాధ్యక్షుడే ఆదేశాలు జారీచేసినట్లున్న వీడియో క్లిప్ ఫిలిప్పీన్స్‌లో సంచలనం కలిగిస్తోంది. విషయం తెలిసిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఇది నకిలీదని ప్రజలను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడుతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఈ వీడియో రావడం ఆందోళనకు దారితీసింది.

సంబంధిత పోస్ట్