ఓటేయకపోతే జరిమానాలు, శిక్షలు!

572చూసినవారు
ఓటేయకపోతే జరిమానాలు, శిక్షలు!
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. అయితే ఓటేయనివారిపై భారత్‌లో చర్యలు లేవు కానీ కొన్ని దేశాల్లో ఓటేయకపోతే పలు శిక్షలు విధిస్తారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఉరుగ్వే, టర్కీ, సింగపూర్ తదితర దేశాల్లో ఓటు వేయకపోతే ఓటరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది సంతృప్తికరంగా లేకపోతే జరిమానా తప్పదు. బెల్జియంలో వరసగా 4 ఎన్నికల్లో ఓటేయకపోతే జైలుకే. ఇక పెరూలో ఓటేయకపోతే రేషన్ ఇవ్వరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్