రుద్రాణికి దీప వార్నింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే

14644చూసినవారు
రుద్రాణికి దీప వార్నింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే
పిల్లల కోసం తీసుకెళ్లిన లంచ్ బాక్స్‌ అనుకోకుండా కిందపడిపోతుంది. దీంతో కార్తీక్ ఓ హొటల్‌కి వెళ్లి ఓ ప్లేట్ మీల్స్ ఇవ్వండి అని అడుగుతాడు. డబ్బులు సాయంత్రానికి తెచ్చి ఇస్తాను అని అంటాడు. కానీ హోటల్ ఓనర్ కుదరదంటే కుదరదని చెప్పేస్తాడు. ఇంతలో ఆ హోటల్‌లో పనిచేసే పనివాడు ‘అన్ని పనులు నేనే చేసుకోవాలి’ అంటూ ఉండగా.. ఆ పని ఏదో నేను చేస్తాను అని చెప్పి కార్తీక్ ఓనర్‌ని ఒప్పిస్తాడు. ఓ పేట్ మీల్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్తాడు. అప్పటికి పిల్లలు ఆకలి తట్టుకోలేక కుళాయినీళ్లు తాగుతుంటారు. అది చూసి కార్తీక్ మరింత కుమిలిపోతాడు.
పిల్లల్ని పిలిచి అన్నం తినిపిస్తాడు.

దీప అదే బొంబాయి భోజన హోటల్‌కి బాబుని వీపుకు కట్టుకుని జంతికలు అమ్మడానికి వెళ్తుంది. హోటల్ ఓనర్ కి జంతికలు నచ్చుతాయి. అమ్మా మీరు పిండివంటలు చాలా బాగా చేశారంటే వంట కూడా బాగానే చేస్తారని అనిపిస్తుంది. మా హోటల్‌లో వంట చేస్తారా? అని అడుగుతాడు. మీరు ఎప్పుడు పనిలో చేరమంటే అప్పుడే చేరతాను అని దీప అంటుంది. ఈ విషయాన్ని రుద్రాణికి తెలియకుండా చాలు అని అంటుంది. దాంతో ఆ హోటల్ యజమాని 'రుద్రాణి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసింది. నేను లొంగలేదు. ఆవిడ అంటే మాకూ పడదు. మీరు కంగారు పడాల్సిన పనిలేదు’ అని అంటాడు. దాంతో దీప బయలుదేరుతుంది. కార్తీక్ అదే సమయంలో హోటల్‌ వైపు వస్తాడు. కానీ దీప, కార్తీక్ ఒకరిని ఒకరుచూసుకోరు.

ఇక దీప ఇంటికి వచ్చేసరికి శౌర్య, హిమలని రుద్రాణి ముద్దు చేస్తూ ఉంటుంది. ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ పిల్లలు మాత్రం ఏడుస్తూ ఉంటారు. దీప వెళ్లి.. ‘రుద్రాణి గారు’ అని అరిచి పిల్లల జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక మరోవైపు సౌందర్య, ఆనందరావులు ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు బయలుదేరతారు. శ్రావ్య, ఆదిత్యలకు జాగ్రత్తలు చెప్పి బ్యాగ్స్ తీసుకుని బయటికి నడుస్తారు. సరిగ్గా అప్పుడే మోనిత కారు సౌందర్య ఇంటి ముందు ఆగుతుంది. ‘ఏంటి? వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు? బహుశా కార్తీక్ సమాచారం ఏదైనా తెలిసిందా?’ అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్