⦿ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి.
⦿ ఇంట్లో దోమలు తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే దోమ తెరలను అమర్చుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలకు రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించాలి.
⦿ ఈ డెంగ్యూ దోమలు పూల తొట్టెలు, నీటి ట్యాంకులు, టైర్లల్లో గుడ్లు పెడతాయి. కాబట్టి ఇంట్లో కుండీల్లో, ఉపయోగించని టైర్లు వంటి వాటిలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.