భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తన రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను డిజీలాకర్‌తో అనుసంధానం చేసింది. ఇక నుంచి రిక్రూట్‌మెంట్ సమయంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మొత్తం డిజీలాకర్ ఆధారంగానే జరగనుంది. మెడికల్ చెకప్‌కు హాజరవ్వాలని కోరుతూ పంపించే లేఖలు, అపాయింట్‌మెంట్ లెటర్లు వంటివి కూడా డిజీలాకర్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. తద్వారా నియామక ప్రక్రియ సమయం తగ్గుతుందని తెలిపారు.