డిప్యూటీ సీఎం బూట్లు మాయం.. పోలీసుల గాలింపు

80చూసినవారు
డిప్యూటీ సీఎం బూట్లు మాయం.. పోలీసుల గాలింపు
బెంగళూరులోని సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. పూజకు ముందు బూట్లు తీసి లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పటికీ అవి మాయమయ్యాయి. దీంతో పోలీసులు, అధికారులు, ఇతర సిబ్బంది బూట్ల కోసం వెతికినా దొరకలేదు. అభివృద్ధి పనుల కోసం జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బూట్లు దొంగిలింపబడ్డాయి. కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. కారులో ఉన్న చెప్పులు వేసుకుని వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్