ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. సీసీ ఫుటేజ్

81చూసినవారు
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధి ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు పరిశీలించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఓ దుండగుడు వీధిలో నడుచుకుంటూ వచ్చి గుడి తలుపులను కాలితో తన్ని తెరిచాడు. అనంతరం లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కాగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్