‘సంస్కృతంబులోని చక్కెర పాకంబు/ అరవ భాషలోని అ
మృతరాశి/ కన్నడంబులోని కస్తూరి వాసన/ కలిసిపోయె తేట తెలుగునందు’ అంటారు మిరియాల రామకృష్ణ. భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు. లిపి వున్న 6 వేలకు పైగా భాషల్లో.. అందమైన లిపివున్న రెండో భాష తెలుగు. గ్రాంథిక భాషలో వున్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి, భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి.