యూపీలోని ఘజియాబాద్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీర్పాల్ గుర్జార్ అనే వ్యక్తి స్థానికంగా ఆలయంలో పూజలు చేసే వాడు. అయితే అతడు దేవుడి ముందు ఓ కోరిక కోరుకున్నాడు. అది నెరవేరలేదని దేవుడిపై కోపం పెంచుకున్నాడు. చివరికి గుడిలో కోడి మాంసం పెట్టాడు. గుడిలో మాంసం చూసిన భక్తుల్లో కోపం కట్టలు తెంచుకుంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. వీర్పాల్ గుర్జార్ ఈ పని చేసినట్లు తేలింది.