రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది జనవరి 15 వరకూ ఉంటుంది. దక్షిణాయనంలో చివరి నెల అయిన ధనుర్మాసంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించడం అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అయితే ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు చేపట్టడంతో ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.