ధరణి పోర్టల్ ద్వారా BC,SC, ST పేదల భూములను BRS నేతలు తన్నుకుపోయారని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 'భూ భారతి చట్టం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టం అవుతుంది. దేశంలోనే భూ సంస్కరణలు తీసుకొచ్చిన నేతల్లో తెలంగాణవారే ఉన్నారు. అందులో పీవీ నర్సింహారావు భూ కమతాల చట్టం, బూర్గుల రామకృష్ణారావు కౌలు రైతుల రక్షణ చట్టం, కొండా వెంకటరంగారెడ్డి జాగీర్దార్ రద్దు చట్టాలు తెచ్చారు' అని గుర్తు చేశారు.