ప్రపంచం మొత్తం నేడు క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన ఇంట్లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు జీవా కోసం శాంటా క్లాజ్ దుస్తులు ధరించి కేక్ కట్ చేశాడు. శాంటా క్లాజ్‌గా మారిన ధోని ఫొటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.