టీమిండియాలో తన ఫేవరెట్ బౌలర్ ఎవరో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వెల్లడించాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన పేవరేట్ బౌలర్ అని తెలిపాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. అభిమానులతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రస్తుత భారత జట్టులో ఫేవరేట్ బౌలర్? బ్యాటర్ ఎవరో చెప్పాలని ధోనీని ప్రశ్నించాడు. ఫేవరట్ బౌలర్ బుమ్రా అని వెంటనే చెప్పిన ధోనీ.. బ్యాటర్ ఎవరో చెప్పడం కష్టమన్నాడు.