సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీపావళి నుంచి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్ల తెలిపింది. 18-59 ఏళ్ల మహిళల ఖాతాల్లో రూ.1500 చొప్పున జమచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేసింది. అయితే కొత్త బస్సులు కొనుగోలు చేశాక పథకం ప్రారంభించనున్నది. మిగిలిన మూడు పథకాలు అమలు చేయాల్సి ఉంది.