TG: తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే తాను ప్రయత్నించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. 'అరపైసా అవినీతి కూడా జరగలేదు. ఇంకా ఎన్నికేసులైనా పెట్టుకో.. ఎదుర్కొంటాం. మంత్రిగా నేను నా బామ్మర్దులకు కాంట్రాక్ట్ ఇచ్చే పని చేయలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ఈ కార్ రేస్ నిర్వహించాం' అని కీలక వ్యాఖ్యలు చేశారు.