ఈ బాధ అప్పుడు గుర్తుకు రాలేదా?: KTR

84చూసినవారు
ఈ బాధ అప్పుడు గుర్తుకు రాలేదా?: KTR
కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. BRS తరఫున ఆమెపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒక్కసారి గతంలో కెళితే కొండా సురేఖ తమపై చేసిన బూతు వ్యాఖ్యలన్నీ బయటకొస్తాయని చెప్పారు. ‘‘అప్పట్లో నేను హీరోయిన్ల ఫోన్లు టాప్ చేస్తున్నానంటూ ఆరోపణలు చేశారు. మరి అలాంటి ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు ఏడవలేదా..? ఈ బాధ అప్పుడు గుర్తుకు రాలేదా..?’ అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్