ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష కేవలం తిరుమల లడ్డూ కోసం కాదన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ లడ్డూలో కొవ్వులు కలవలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి దారుణంగా ఉందని పవన్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం దేవాలయాల పట్ల దారుణంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. హిందూ ధర్మం, దేవాలయాలను పరరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టానని తెలిపారు.