ఈవీఎంల పనితీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిలో నమోదు చేసిన ఓట్లలో తేడాలున్నాయని ఆరోపించారు. ‘ఓట్ల విషయంలో కచ్చితంగా కొంత తేడా ఉంది.. కానీ ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర లేవు. మరికొందరు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కారణంగా ఈ ఎన్నికలు మహారాష్ట్ర ప్రజల్లో ఆందోళనను సృష్టించాయి’ అని వ్యాఖ్యానించారు.