కృష్ణజింకను చంపిన చిరుత.. షాక్‌తో మరో ఏడు మృతి

63చూసినవారు
కృష్ణజింకను చంపిన చిరుత.. షాక్‌తో మరో ఏడు మృతి
గుజరాత్‌లోని జంగిల్‌ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపింది. దీన్ని చూసి భయంతో షాక్‌కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి. జవనరి 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై గుజరాత్‌ అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహమున్న ప్రదేశానికి సమీపంలో ఈ పార్కు ఉంది. చిరుత పులులు అధికంగా ఉన్న శూల్పనేశ్వర్‌ అభయారణ్యం దీనికి అత్యంత సమీపంలోనే ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్