‘ది గోట్‌ Vs ఓజీ’ సీక్వెల్‌పై దర్శకుడు ఆసక్తికర కామెంట్‌

72చూసినవారు
‘ది గోట్‌ Vs ఓజీ’  సీక్వెల్‌పై దర్శకుడు ఆసక్తికర కామెంట్‌
తమిళ సూపర్ స్టార్ విజయ్‌ నటించిన ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ మూవీ సీక్వెల్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీ‌ని స్థాపించిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించరని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వెంకట్‌ ప్రభు వ్యాఖ్యలపై విజయ్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026 ఎన్నికల తర్వాత ఈ సినిమాపై అప్‌డేట్ ఇస్తానని చెప్పడంతో దళపతి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్