ఏపీ చంద్రబాబుపై ప్రజాశాంతి అధ్యక్షడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ సభకు వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయన్నారు. కేవలం 9 నెలల్లోనే చంద్రబాబును మింగే స్థాయికి పవన్ చేరుకున్నాడు. చిరంజీవి 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసుకున్నాడు. చంద్రబాబు టీడీపీనే జనసేనలో విలీనం చేసే పరిస్థితిలో ఉన్నారా? అనిపిస్తుంది. చంద్రబాబు తొమ్మిది నెలల్లో దారుణంగా దిగజారి పోయారని పాల్ మండిపడ్డారు.