గత సంవత్సరం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీ (కరప్షన్స్ ఇండెక్స్) లో భారత్ 96వ స్థానంలో నిలిచిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. సున్నా నుంచి 100 వరకూ స్కోరు ఉండే ఈ సూచీలో సున్నా స్కోరు కలిగిన దేశం పూర్తి అవినీతి మయమైనదిగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. 2024లో భారత్ స్కోరు 38గా నమోదైంది.