వేములవాడ సభలో మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ఏడాదికి రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లోని (SHG) ప్రతి మహిళా సభ్యురాలికి 2 చీరల చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు. పవర్ లూం నుంచే కాకుండా పాలిస్టర్, కాటన్ కలగలిపిన 1.30 లక్షల చీరలను పంపిణీ చేస్తామని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధికి నిధులిచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.