బీట్‌రూట్ ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ ఆకులలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బీట్‌రూట్ ఆకులను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి.. వృద్ధాప్య లక్షణాల నుంచి కాపాడుతుంది.