వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని సన్నిహితురాలు దివ్వెల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తనపై, దువ్వాడ శ్రీనివాస్‌పై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాధవికి మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.