వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో 2వ సీడ్ నొవాక్ జకోవిచ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో జకోవిచ్ 6-3, 6-4, 5-7, 6-4తో ఫెరెమ్లె(బ్రిటన్)ను ఓడించాడు. మరో పోటీలో 10వ సీడ్ డిమిట్రోవ్ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో షంగ్ పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక 14వ సీడ్ షెల్టన్ 4-6, 7-6(7-5), 6-7(5-7), 6-3, 7-6(10-7)తో హారీస్ ను ఓడించి మూడోరౌండ్‌కు చేరారు.