మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి రేటు తగ్గుతోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే, కొన్ని సాధారణ ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. వీర్యకణాల సమస్యలున్న పురుషులు అరటిపండ్లను క్రమం తప్పకుండా తింటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. దానిమ్మను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని, పురుషుల లైంగిక ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. క్యారెట్ తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. గుడ్లు వీర్యకణాల ఉత్పత్తి రేటును పెంచుతాయి. మీకు స్పెర్మ్ సమస్యలుంటే క్రమం తప్పకుండా గుడ్లు తినాల్సిందే.