భోజనం చేసే సమయంలో దక్షిణం దిశగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆ దిక్కు యముడు, మన పితరులకు చెందుతుందని పేర్కొంటున్నారు. దక్షిణ దిశగా కూర్చుని భోజనం చేస్తే, శరీరంలో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఒత్తిడి, అనారోగ్యానికి కారణమవుతుంది. ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పడకగదిలో ఎప్పుడూ తినకూడదు.