బాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ సినిమా అర్ధరాత్రి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష లాల్వానీ, తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. ఆ సమయంలో కల్కి 2898 ఏడీ సినిమాతో గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.