పూజలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ సప్తముఖ మహాగణపతి

67చూసినవారు
పూజలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ సప్తముఖ మహాగణపతి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహం పూజలకు సిద్ధమైంది. ఖైరతాబాద్‌ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండడంతో.. 70 అడుగుల సప్తముఖ మహాగణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ముహూర్తం ప్రకారం గురువారం మ.12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్‌.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. కాగా, మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది.

సంబంధిత పోస్ట్