మహాశివరాత్రి రోజు చాలా మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. శివుడి అనుగ్రహం కోసం జాగరణ, ఉపవాస వ్రతాలు చేస్తారు. ఇలా చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇక ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన రానుంది. అయితే శివరాత్రి వేళ కలలో ఈ 6 సంకేతాలు కనిపిస్తే మీపై శివుడి అనుగ్రహం ఉన్నట్లేనని వేదపండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందు కలలో శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తే మీ కష్టాలు పోతాయని, జీవితం ఆనందమయం అవుతుందని అర్థం.
2.అదే కలలో బిల్వపత్రం, బిల్వ వృక్షం కనిపిస్తే ఆ దేవుడు మీపై దయ చూపుతాడని, ఆర్థిక సమస్యలను తొలగిస్తాడని అర్థం.
3. ఒకవేళ రుద్రాక్ష మాల లేదా ఒక్క రుద్రాక్ష అయినా కలలో కనిపించినట్లైతే శివుని అనుగ్రహంతో మీ బాధలు, దోషాలు, రోగాలు తొలగిపోతాయని అర్థం.
4. కలలో శివలింగం కనిపిస్తే మీ ఉద్యోగంలో పురోగతి లభిస్తుందని, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అర్థం.
5. శివుడు, పార్వతి కలిసి కూర్చున్నట్లు కలలో కనిపిస్తే మీ దాంపత్య సమస్యలు పోతాయని, వైవాహిక జీవితం సంతోషంగా మారుతుందని అర్థం.
6. శివరాత్రికి ముందు కలలో నాగదేవత దర్శనమిస్తే మీ సంపద పెరుగుదలకు సంకేతమని అర్థం.