ప్రపంచంలోనే అత్యంత బరువైన కీటకంగా జెయింట్ వెటా గుర్తింపు పొందింది. ఎలుక కంటే మూడు రెట్లు బరువు ఉండే ఈ కీటకాలు.. గరిష్టంగా 71 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. ఈ కీటకాలు మనుషులకు ఎలాంటి హానీ చేయవు. ఇవి క్యారెట్లను, మొక్కలను ఇష్టంగా తింటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులను కూడా ఆహారంగా తీసుకుంటుంది. పూర్తిగా పెరిగిన జెయింట్ వెటా 17.5 సెంటీ మీటర్లు లేదా 7 అంగుళాల పొడువు ఉంటుంది.