ఇండియాస్పోరా, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ మంత్రి లోకేష్ వారిని ఆహ్వానించారు. 'సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు కాబోతుంది. పరిశ్రమలకు అవరసరమై ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నాం' అని లోకేష్ అన్నారు.