ఏపీ సీఎం చంద్రబాబు మరో వినూత్న ఆలోచనకు నాంది పలికినట్లు తెలుస్తోంది. ఏకంగా 1,50,000 మంది పేదల కుటుంబాలకు విద్యుత్ ఉపకరణాలు పంపిణీ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఇళ్లకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, బీఎల్ డీపీ ఫ్యాన్లు పంపిణీ చేయనున్నారు. వీటి వల్ల విద్యుత్ పెద్ద ఎత్తున పొదుపు చేసేందుకు వీలు పడుతుంది.