గత ఎపిసోడ్‌లో రిషి కాలేజ్‌లో జగతితో ‘వసుని హాస్టల్‌కి పంపించేయండి’ అని చెప్పడంతో నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది. గుప్పెడంత మనసు 326వ ఎపిసోడ్ లో హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
వసూని హాస్టల్ పంపమని రిషి అంగన్ జగతి షాక్ అవుతుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. దీంతో రిషి మాట మారుస్తాడు. వసు కాలేజ్‌లో ఒంటరిగా ఉంటే రిషి వెళ్లి క్లాసు రూమ్‌లో పడేసుకున్న గోలీలు అందిస్తాడు. వెంటనే వసు థాంక్స్ చెబుతుంది. రిషి టై(ఉదయాన్నే కారులో జుట్టు కట్టుకోవడానికి ఇచ్చాడు)ని రిషికి తిరిగి ఇస్తుంది. ఇక నైట్‌కి గౌతమ్ బొమ్మ గీస్తూ.. ‘రేయ్ అందమైన అమ్మాయిని గీస్తున్నా.. నీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పరా’ అంటాడు. దానికి వసుని తలుచుకుంటూ రిషి కొన్ని చెబుతాడు. తర్వాత బయటికి వెళ్లి మౌత్ ఆర్గాన్ వాయిస్తూ ఉంటాడు. ఇంతలో రిషి ఇచ్చిన వసు గోలీలను నెమలిఈకలు ఉన్న ఫ్లవర్ వాజ్‌లో వేసి ఫొటోస్ తీసి రిషికి పంపిస్తుంది. చూసి ఊరుకుంటాడు. దాంతో వసు ‘రిప్లై ఇస్తే మీ సొమ్ము ఏం పోతుంది’ అని మనసులో తిట్టుకుంటుంది.
అయితే జగతి మాత్రం రిషి చెప్పినదాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. హాస్టల్‌కి వెళ్లు అని జగతి వసుకి చెప్పనుందేమో..? తర్వాత ఎపిసోడ్ లో చూడాలి. వసు కాలేజ్‌కి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి జగతి బ్యాగ్ వేసుకుని వెళ్లబోతుంది. ‘మేడమ్ నేను వస్తానుగా కాలేజ్’ అని బయలుదేరబోతుంటే ‘ప్రతి రోజు కార్ అలవాటు అయ్యిందా? ఆటోలో కాలేజ్‌కి వచ్చెయ్.. నువ్వు ఒంటరిగా రావడం నేర్చుకో’ అని చెప్పి జగతి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. వసుని కలవడానికి రిషి, గౌతమ్ వస్తారు. ‘వసుధరా మేడమ్ గారు ఇంట్లో లేరా’ అని రిషి అడుగుతాడు. ‘మేడమ్ కాలేజ్ కి వెళ్లింది సార్’ అని వసు బాధగా అంటుంది. ‘నువ్వు ఎలా వస్తావ్’ అని రిషి అడగ్గా.. ‘నేను సౌకర్యాలకు.. కార్లకు అలవాటు పడలేదు సార్..ఆటోలను మరిచిపోలేదు సార్’ అంటుంది. జగతి మేడమ్ నేను చెప్పిన పని మొదలుపెట్టారని రిషి అనుకుంటాడు.