ఒక వయసు వచ్చి, వివాహం చేసుకోగానే సెక్స్ అనేది మనిషి జీవితంలో ఓ ముఖ్యభాగం అవుతుంది. రోజువారీ పనుల్లో అది కూడా ఒకటిగా నిలిచిపోతుంది. అయితే, వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి భార్యభర్తలు విడిపోవడం, లేదా వృత్తిరిత్యా భాగస్వామి దూరంగా ఉండడం లాంటి కారణాల వల్ల శృంగారానికి విరామం వస్తుంటుంది. శృంగారం అలవాటుగా మారాక, అనుకోని కారణాల వల్ల ఆపేస్తే ప్రమాదమేనంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు సెక్స్ చివరి ఆప్షన్ అయినప్పటికీ, ఆందోళన తగ్గించేందుకు మాత్రం శృంగారం బాగా పనిచేస్తుంది. సెక్స్ అనేది మీ శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదలను తగ్గిస్తుంది. కాబట్టి తరచూ సెక్స్ లో పాల్గొనే వారు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడంతోపాటు.. ఆందోళనకు దూరంగా ఉంటారు. శృంగారానికి దూరమైనప్పుడు మీకు తెలియకుండానే మీలో ఆందోళన పెరుగుతుంది. పరిశోధనల ప్రకారం.. వారంలో రెండు లేదా మూడు సార్లు సెక్స్ చేసుకునే వారిలో కన్నా.. నెలలో ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయట. ఇందుకు కారణం లేకపోలేదు.. సెక్స్ అనేది శరీరానికి వ్యాయామంలా పనిచేసి ఆందోళన, ఒత్తిడిలను తగ్గిస్తాయి. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గుండె బాగా పనిచేస్తుంది. సెక్స్ అనేది నిమిషానికి 5 కేలరీలను కరిగిస్తుంది. ఇది దాదాపు రోజూ వాకింగ్ చేసిన దాంతో సమానం. దీంతోపాటు శృంగారంలో పాల్గొనడం అనేది మెట్లు దిగడం, తోటలో పనిచేయడంతో సమానమైన వ్యాయామాలుగా సాయపడుతుంది. అందుకే సెక్స్ అనేది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిచడంతో పాటు వ్యాయామంలా పనిచేస్తుందటారు. కామక్రీడలు ఆపేస్తే వ్యాయామం తగ్గినట్టే కదా మరి.
అర్థం కాలేదు కదా.. సెక్స్ చేయడం మానేస్తే తాళం చెవిలు మర్చిపోవడం ఏంటా అనుకుంటున్నారు కదా. అదేనండి మతిమరుపు వస్తుందన్నమాట. ఎందుకంటే తరుచూ శృంగారం చేయడం వల్ల జ్ణాపకశక్తి పెరుగుతుందట. తరుచూ సెక్స్ చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. ఎందుకంటే.. శృంగారం అనేది క్రిములతో పోరాడే ఇమ్యునోగ్లోబిన్-ఏ పెంచుతుంది. వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వారిలో కన్నా.. నెలలో ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందట. సెక్స్ అనేది మీ బ్రెయిన్ వాష్ చేసి.. మీ భాగస్వామితో మీరు ఎక్కువ కాలం కలిసి మెలిసి ఉండేలా చేస్తుంది. శృంగారం లేకుండా మీ వైవాహిక జీవితంలో సంతృప్తి కరువై.. బంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. వారంలో కనీసం ఒకసారైనా శృంగారంలో పాల్గొనే జంటలు సుఖంగా.. సంతోషంగా జీవిస్తున్నారు. సరైన కారణం తెలియనప్పటికీ.. ఓ అధ్యయనం చెబుతున్న విషయమేటిటంటే.. నెలకు దాదాపు 20 రోజుల పాటు స్కలనం చేసే వారితో పోలిస్తే.. నెలకు ఏడు సార్లు కన్నా తక్కువ స్కలనం చేసిన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్(వీర్య గ్రంథి క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అలాగని అసురక్షిత, అనామక శృంగారం, బహుళ భాగస్వాములకు మొగ్గు చూపకండి. ఇది వీర్యగ్రంథి క్యాన్సర్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
సెక్స్ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహకరించే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదల కావు. మహిళల్లో నిద్రకు సహాయపడే ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మీరు చాలా రోజుల తర్వాత మళ్లీ సెక్స్ చేయాలనుకుంటే ముందు రోజు రాత్రి మంచి నిద్ర అవసరం లేదంటే మీరు నీరసంగా ఉంటారు. శృంగారం అనేది మీ మనసును రకరకాల నొప్పుల నంచి మళ్లిస్తుంది. ఉద్వేగం మీ శరీరం తల, వెన్నుముక, కాళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ నొప్పి, నెలసరి సమయాల్లో వచ్చే తిమ్మిర్లు తగ్గించడానికి కూడా సహాయపడవచ్చు. ఇది వినడానికి బాగా లేనప్పటికీ.. శృంగారం చేయడం ఆపేస్తే స్త్రీలలో రుతుక్రమం ఆగి, యోని కణజాలం సన్నగా మారుతుంది. అంతేకాకుండా పొడిబారిపోతుంది. అది శృంగారం చేసే సమయంలో బాధ కలిగిస్తుంది. కోరికల్ని కూడా బలహీనపరుస్తుంది. ఇంకొన్ని పరిశోధనల ప్రకారం.. వారానికి ఒకసారి కంటే తక్కువ లైంగిక సంబంధం కలిగి ఉండే పురుషుల్లో అంగస్థంభన తక్కువగా ఉంటుందట. శృంగారం అనేది శరీరంలో బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. సెక్స్ అనేది వ్యాయామంలా మారి ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా బీపీ పెరగకుండా ఉంటుంది. సెక్స్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్‌గా బీపీ పెరుగుతుంది.