ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. శనివారం ఉ. 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. శనివారం ఉ. 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయం తీసుకురానున్నారు. ఉ. 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని పార్థీవదేహం ఉండనుంది. శుక్రవారం రాత్రికి మన్మోహన్ కుమార్తె అమెరికా నుంచి భారత్ చేరుకోనున్నారు.