యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్‌ కోడ్‌

78చూసినవారు
యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్‌ కోడ్‌
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. స్వామి వారి నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, వ్రతాలు సహా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు జూన్ 1 నుంచి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. కాగా ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు దీని నుంచి మినహాయింపు కల్పించారు.

సంబంధిత పోస్ట్