రాత్రి పడుకునే ముందు హెర్బల్ టీని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, కొన్ని మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.