కోల్ కతాలో లాలాబాగన్ నబన్ కూర్ వద్ద దుర్గామాతను పర్యావరణహితంగా రూపొందించారు. మండపంలో ఆహ్లదకరమైన వాతావరణంలో నెలకొల్పిన అమ్మవారి ప్రతిమలను వెదురు, మనీ ప్లాంట్ , కూరగాయలు, పలు రకాల పండ్లతో అలంకరించారు. దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు ఐదు నెలలు శ్రమించి.. 8వేల మొక్కలను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.