హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

80చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. చంబా జిల్లాలో శనివారం స్వల్ప భూకంపం వచ్చింది. సిమ్లా వాతావరణ కేంద్రం ప్రకారం, మధ్యాహ్నం 1:16 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. భూఉపరితలం నుండి 9 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉంది. ప్రస్తుతం భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్