జమ్మూకశ్మీర్‌లో మంగళవారం
భూకంపం సంభవించింది. కిస్త్వార్ ప్రాంతంలోఈ రోజు ఉదయం 8:53 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ
భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.