ప్రపంచ శాంతి కోసం మహాయాగం నిర్వహిస్తున్నామని కంచి కామకోటి పీఠం అధిపతి విజయేంద్ర సరస్వతి తెలిపారు. అయోధ్యలో నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకూ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం చేస్తామని చెప్పారు. 45 రోజుల పాటు జరిగే యాగంలో 1200 మందికి పైగా వేద పండితులు పాల్గొననున్నట్లు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామకోటి పీఠం, చిన్మయి సేవా ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తామని చెప్పారు.