మారేడు ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులను నమిలి తినడం వల్లన కీళ్ల సంబంధవ్యాధులు, విరేచనాలు, శరీర దుర్వాసన తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి.