TG: హన్మకొండ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల కవిత అనే మహిళ (36) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం గురువారం తన భర్తతో కలిసి ఆర్టీసీ బస్సులో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి, వస్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె భర్త లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే కవిత మృతిచెందినట్లు నిర్ధారణ చేసుకొని కన్నీరు మున్నీరయ్యారు.