ఈడీ దాడులు.. వాషింగ్ మెషిన్ లో డబ్బులు లభ్యం

180410చూసినవారు
ఈడీ దాడులు.. వాషింగ్ మెషిన్ లో డబ్బులు లభ్యం
హైదరాబాద్ లో కాప్రికార్న్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలో ఈడీ దాడులు చేసింది. సోదాల్లో ఓ వాషింగ్ మెషిన్లో నగదు లభ్యం కావడం ఈడీ అధికారులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. దీంతో డబ్బును వెంటనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్