స్టాక్ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేయగల అంశాల్లో
ఎన్నికలు కూడా ఉంటాయి. కొత్త ప్రభుత్వంలో పాలసీలు, నిర్ణయాల అంచనాలతో స్టాక్స్ ఒడుదొడుకులకు లోనవుతాయి. అయితే కొన్ని రంగాలపై అంతగా ప్రభావం ఉండదు. వాటిలో ఆటోమొబైల్స్, పవర్, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఫెర్టిలైజర్స్&కెమికల్స్, టెలికాం, ఫార్మా, గ్లోబల్ కమోడిటీస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచిస్తున్నారు.