దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల హవా మొదలైంది. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో PMV EaS-E కంపెనీ భారత్‌లో త్వరలోనే చౌవకైన ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది. ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48 వోల్ట్ బ్యాటరీ ఏర్పాటు చేయగా ఒక సారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ వెళ్లొచ్చు. ఇది గరిష్టంగా 70 కి.మీ వేగంతో వెళ్తుంది. దీని ధర రూ.4-5లక్షల మధ్య ఉండనుంది.