ప్రస్తుత కాలంలో చాలా మంది వాట్సాప్‌లో చాట్ చేసేటప్పుడు మేసేజ్ పూర్తి చేయకుండానే ఆఫ్‌లైన్‌కి వెళ్లి మర్చిపోతుంటారు. ఇలా ఇన్‌కంప్లీట్ చేసిన మేసేజ్‌లు ఇక నుంచి ఆటోమెటిక్‌గా డ్రాఫ్ట్‌లో సేవ్ అవుతాయి. దాంతో చాట్ విండో ఓపెన్ చేసినప్పుడు ఇతర చాట్‌లతోపాటు డ్రాఫ్ట్ లేబుల్ ఉన్న మెసేజ్‌లు కూడా కనిపిస్తాయి. వాటిని కావాల్సినప్పుడు మనం సెండ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులో ఉంది.